సిరా న్యూస్,తిరుపతి;
తొట్టంబేడు మండల పరిధిలోని బసవయ్యపాలెం దగ్గర గల సింగమాల ఫారెస్టు చెక్ పోస్టు లో ప్రొటెక్షన్ వాచర్ గా వెంకటేష్ విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి ఒంటి గంట సమయములో పెద్ద కన్నలి ఎస్టీ కాలనీ సమీపంలో హైవే పోలీస్ పెట్రోలింగ్ సిబ్బందికి అంతకుముందు జరిగిన ఒక ఆక్సిడెంట్ లొకేషన్ చూపించాడానికి వెళుతున్నాడు. వారి వాహనాన్ని జాతీయ రహదారిపై వేగంగా ఒక ఐచర్ వాహనం ఢీకొట్టడం తో వెంకటేష్ వాహనములో నే మృతి చెందాడు. ఈ ఘటన లో ఇద్దరు కానిస్టేబుళ్ల కు స్వల్ప గాయాలు అయ్యాయి.