సిరా న్యూస్,హైదరాబాద్;
మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. రాష్టంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని ప్రాజెక్టులు నిండి పొంగి పొర్లుతున్నా, మంజీరా నది పైన ఉన్నసింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టులు ఇంతవరకు నిండ లేదు. అయితే, గోదావరి, కృష్ణ నదికి వచ్చిన లెవెల్లో కాకపోయినా, గత వారం రోజులుగా మంజీరాకు కర్ణాటక, మహారాష్ట్రల నుండి విరామం లేకుండా వరద వస్తూనే ఉంది.మంజీరా పరివాహక ప్రాంతమైన సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు రావటంతో, ప్రాజెక్టులకు జలకళ సంతరించుకున్నది. కామారెడ్డి , సంగారెడ్డి జిల్లాల బోర్డర్ లో ఉన్న నిజాం సాగర్ ఒక గేట్ బుధవారం సాయంత్రం ఎట్టి నీటిని దిగువకు వదలగా, సింగూరు ప్రాజెక్ట్ గేట్లు గురువారం ఎత్తడానికి నీటిపారుదల శాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. మహారాష్ట్ర లో ఉన్న బాలఘాట్ రేంజ్ లో పుట్టే మంజీరా నది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణించి, సంగారెడ్డి జిల్లాలోని జన్వాడ వద్ద తెలంగాణలోకి ప్రవహిస్తున్నది.మంజీరా మీద అతి పెద్ద ప్రాజెక్ట్ అయినా సింగూరు ను, సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలంలో నిర్మించారు. ఆ ప్రాజెక్ట్ పూర్తీ నిల్వ స్థాయి 29. 91 టీఎంసీలు. గురువారం ఉదయం ప్రాజెక్ట్ లోకి 45,000 క్యూసెక్స్ వస్తుండగా, ప్రాజెక్ట్ లో నీటి నిల్వ 27. 81టీఎంసీలకు చేరుకున్నది. జెన్కో అధికారులు, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం, 12 గంటల వరకు ప్రాజెక్ట్ గేట్లు తెరిచి నీటిని కిందకి వదలనున్నారు. కామారెడ్డి జిల్లాలో ఉన్న, నిజాం సాగర్ లో పూర్తి స్థాయి నీటి మట్టం 17.801 టీఎంసీలు కాగా, ఇప్పటివరకు నీటిమట్టం 16.5 టీఎంసీలు చేరుకున్నదినీటి పారుదల శాఖ అధికారులు మాత్రం, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అయినా, పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఒక క్రెస్ట్ గేట్ లేపి 2,000 ల క్యూసెక్కు ల నీటిని కిందకు వదలటం ప్రారంభించారు. ప్రస్తుతం, నిజాం సాగర్ లోకి సుమారుగా 30,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. సింగూరు గేట్లు పైకి లేపటం వలన, ఇంకా ఆ ప్రవాహం మరింత పెరగనున్నది. సింగూర్ కింద, సంగారెడ్డి పట్టణం దగ్గర నిర్మించిన మంజీరా డాం కూడా పొంగి పొర్లతున్నది.మంజీరా డాం పూర్తి స్థాయి నీటి నిల్వ 1.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్ట్ నిండుకుండా ల మారటంతో, క్రెస్ట్ గేట్లు లేపి మంగళవారం సాయంత్రమే నీటని కింద నది ప్రవాహంలోకి వదిలారు. మెదక్ జిల్లాలోని మంజీరా నదిపైన నిర్మించిన ఏడుపాయలప్రాజెక్ట్ కూడా గత వారం రోజులుగా పొంగిపొర్లుతున్నది.అదేవిధంగా , సంగారెడ్డి, మెదక్ జిల్లాలో మంజీరకు, గోదావరికి ఉపనదులైన నక్కవాగు, నల్లవాగు, హల్దీవాగు, కూడాలేరు, మోయతుమ్మెద వాగు, పెద్ద వాగు, గుండు వాగు, సిద్దిపేట వాగు, మరెన్నో వాగులు పొంగిపొర్లుతున్నాయి. నల్లవాగు పైన నిర్మించిన, నల్లవాగు ప్రాజెక్ట్ కూడా గత మూడు రోజులుగా పొంగిపొర్లుతున్నది.సంగారెడ్డి, కామారెడ్డి జిల్లా మధ్యలో ఉన్న పోచారం డ్యామ్ కూడా మూడురోజుల పంగుతున్నది. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకోవడంతో, యాసంగి పంటలకు కూడా సాగు నీటికి ఎటువంటి డొక ఉండదని రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.