సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది. గత పదేళ్ళు అధికారం లేక అష్టకష్టాలు పడ్డ కాంగ్రెస్ కేడర్‌కు అధికారంలోకి రాగానే రెట్టింపు ఉత్సాహం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా జులై 27వ తేదీతో తన పదవీ కాలం ముగిసినప్పటికీ, ఇప్పటివరకు హైకమాండ్ నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించలేదు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టి పదేళ్లు అస్తవ్యస్తంగా తయారైన తెలంగాణను గాడిలో పెట్టడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. నిత్యం సచివాలయానికి అందుబాటులో ఉంటూ సహచర మంత్రులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పాలనపై సీరియస్ గా దృష్టి పెట్టాడు.రేవంత్ రెడ్డి అపధర్మ పీసీసీ అధ్యక్షుడిగా అడపాదడప గాంధీభవన్‌లో పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కానీ పూర్తిస్థాయిలో పాలన దృష్టి పెట్టి, పార్టీ కార్యక్రమాలకు సమయం కేటాయించలేకపోవడంతో పార్టీలో కొంత స్తబ్దత నెలకొంది. కేడర్ అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలో పార్టీ చేరికలపై పార్టీ వ్యవహారాలపై ఇంచార్జ్ దీపాదాస్ మున్సీ పూర్తిగా పార్టీలో ఇన్వాల్వ్ అయి, గాంధీభవన్ అందుబాటులో ఉంటూ దూకుడుగా వ్యవహరిస్తోంది. మరొక వైపు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురా రావడానికి కష్టపడ్డ కార్యకర్తలు పరిస్థితి గందరగోళంగా తయారైంది,ఇంచార్జ్‌గా దీపదాస్ మున్సీ పార్టీ వ్యవహారాల్లో అనుకున్న దాని కంటే ఎక్కువ కలగజేసుకుని కష్టపడ్డ వారిని కాదని కేవలం గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్న నేతలకే కార్పొరేషన్ పదవుల్లో ప్రియారిటీ దక్కుతుందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సరైన కేడర్‌ను పట్టించుకోకపోవడంతో మొదటి నుంచి కష్టపడ్డ తమ పరిస్థితి ఏంటని ఆ నేతలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దగ్గర తమ గోడు వెళ్లబోసుకుంటున్నారని, గాంధీభవన్ వర్గాలలో చర్చ జరుగుతుంది.కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్సీ కి పార్టీపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో కేవలం తనతో సన్నిహితంగా ఉన్న వారికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టడానికీ ప్రాధాన్యత ఇస్తుందని, కష్టపడ్డ వారిని పట్టించుకోట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పీసీసి అధ్యక్షుడిగా తన పదవి కాలం ముగియడంతో పార్టీ వ్యవహారాలను తగ్గించి, పాలనపై పూర్తి స్థాయిగా దృష్టి సారించడంతో తమ గోడు ఎవరు వింటారు. పార్టీ కోసం కష్టపడ్డ తమని గుర్తించి ఎవరు. కార్పొరేషన్ పదవులలో అవకాశం ఇస్తారని కొంత మంది నేతలు సన్నిహితుల దగ్గర తమ తమ బాధ వెళ్లగక్కుతున్నారట. మరీ వాళ్ళ గోడు వినిపించుకుని కష్టపడ్డ వారికి గుర్తింపు లభిస్తుందా లేదా అనేది చూడాలి..!