తీవ్ర గాయాలు ఒకరు అక్కడికక్కడే మృతి
చికిత్స కోసం తరలించగా ఆసుపత్రిలో మరొకరు మృతి
సిరా న్యూస్,పటాన్చెరు;
ద్విచక్రవాహానాన్ని, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఒకరికి స్వల్పగాయాలైన ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై అభిమాన్ తెలిపిన వివరాల ప్రకారం… పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన కూలీపని చేసే వెంకటేష్(34) పనిమీద ఇదే గ్రామానికి చెందిన రమేష్ (35), మల్లేష్ లను బైక్ పై ఎక్కించుకొని ఇస్నాపూర్ కు వచ్చి తిరిగి గ్రామానికి వెళుతున్నారు. ఎస్బీఐ బ్యాంక్ చౌరస్తాలో జాతీయ రహదారి దాటుతుండగా పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే లారీ వెనుకనుంచి వచ్చి బైకును ఢీ కొట్టింది. దీనితో ముగ్గురు కిందపడిపోగా వెంకటేష్ కు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు రమేష్ ను తొలుత పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తలరించి, ప్రథమచికిత్స అనంతరం, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇక మల్లేష్ కు స్వల్పగాయాలయ్యాయి. మృతుల ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి,ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
==================xxx