*రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
సిరా న్యూస్,బద్వేలు;
రాయచోటి నియోజకవర్గంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం రాయచోటి మండల పరిధిలోని గుంటిమడుగు గ్రామంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బోరుకు నూతన మోటార్ ఏర్పాటు చేయించి గ్రామానికి నీటి సరఫరా చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…. గతంలో రాయచోటి నియోజకవర్గంలో ప్రజలు నీటి సమస్యతో నాన ఇబ్బందులు ఎదుర్కొనే వారిని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరు కూడా నీటి సమస్యతో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో బోర్లు వేసి నీటి సమస్య పరిష్కరించడం జరుగుతుందన్నారు.
రాబోయే రోజులలో రాయచోటి నియోజకవర్గంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా గుంటిమడుగు గ్రామానికి చేరుకున్న మంత్రివర్యులను ఆ గ్రామ ప్రజలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
గుంటిమడుగు గ్రామానికి పుష్పులంగా నీరు రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.