అనంతపురంలో సెల్ రికవరీలో రికార్డు

సిరా న్యూస్,అనంతపురం;
స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగం అయిపోయింది. ఒక్క పూట అన్నం లేకపోయినా ఉంటారేమో కానీ ఒక్క క్షణం ఫోన్ లేకుంటే ఉండలేని పరిస్థితి ప్రస్తుత కాలంలో నెలకొంది. అలాంటి సెల్ఫోన్ చోరీకి గురైతే మనం పడే టెన్షన్ చెప్పలేనిది. ఎందుకంటే సెల్ ఫోన్ కన్నా అందులో ఉన్న మన డేటా అంత ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రస్తుత కాలంలో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి సెల్ఫోన్లో భద్రపరుచుకునే స్థాయికి వచ్చేసాం. అందుకే సెల్ఫోన్ చోరీకి గురైందంటే చాలు మనకి ఎక్కడా లేని టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ టెన్షన్ అక్కర్లేదు అంటున్నారు అనంతపురం జిల్లా పోలీసులు. మీ ఫోన్ పోయిందా ఆన్లైన్లో మీ ఫోన్ కు సంబంధించిన వివరాలతో కంప్లైంట్ ఇస్తే మీ ఫోను మీ చెంతకే చేరుస్తున్నారు. ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకు గురై అవి ఇతర రాష్ట్రాలకు చేరినా రికవరీలో రాజీపడకుండా వాటిని పోలీసులు రికవరీ చేస్తున్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా పోలీసుశాఖ అందజేసిన మొబైల్ ఫోన్లు 10,195… వీటన్నింటి విలువ సుమారు రూ 18.85 కోట్లు. ఈరోజు అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో రికవరీ మొబైల్ ఫోన్ల మేళా నిర్వహించి… రూ.3.45 కోట్ల విలువ చేసే 1309 మొబైల్ ఫోన్లు బాధితులకు జిల్లా ఎస్పీ జగదీష్ అంచించారు. చొరికి గురై దొరకవని ఆశలు వదలిన సెల్ ఫోన్లను పోలీసుల ద్వారా అందుకుని జిల్లా పోలీసుశాఖ పట్ల హర్షం వ్యక్తం చేసిన బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అందజేసిన 10,195 మొబైల్ ఫోన్లలో అనంతపురం జిల్లావాసులకు- 6504, శ్రీ సత్య సాయి -1012, కర్నూలు- 589, కడప-401, చిత్తూరు-92, గుంటూరు-81, తిరుపతి-55, నెల్లూరు-53, తూర్పు గోదావరి-38, ప్రకాశం-36, కృష్ణ-35, పశ్చిమ గోదావరి-33, విజయవాడ-28, విజయనగరం-21, కాకినాడ-18, శ్రీకాకుళం-15, ఏలూరు-12, ఒంగోలు-09, విశాఖపట్నం-07కర్నాటక -415, తెలంగాణ-385, కేరళ-93, తమిళనాడు-71, మహరాష్ట్ర-60, పశ్చిమ బెంగాల్ – 39, ఉత్తరప్రదేశ్ – 19, బీహార్-15, అస్సాం-13, రాజస్థాన్-11, ఒడిస్సా-09, గుజరాత్-08, మధ్యప్రదేశ్-05, హర్యాన-03, జమ్ము కాశ్మీర్-03, ఛత్తీస్ ఘడ్-02, జార్కండ్-02, డెహ్రాడూన్-01, డిల్లీ-01, పంజాబ్ -01.వినియోగదారులు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆ ఫోన్ కు సరైన బిల్ ఉంటేనే కొనుగోలు చేయాలని తక్కువ ధరకు వస్తుందని సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లను కొనుగోలు చేస్తే మీరు మీ డబ్బుతో పాటు ఫోన్ కూడా కోల్పోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులైనా, వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కల్గిన బాక్సు ఉంటేనే కొనాలని సూచించారు.
చాట్, భాట్ లేదా సీఈఐఆర్ లో ఎలా నమోదు చేసుకోవాలి :
సెల్ఫోన్ చోరీకి గురైతే చాట్ భాట్ లేదా సీఈఐఆర్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ చాట్ బాట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని అనంత పోలీసులు వెల్లడించారు.
ఫోన్ చోరీకి గురైనా మిస్ అయినా చాట్ బాట్ లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీఈఐఆర్ ద్వారా నమోదు చేసుకోవాలి.
సీఈఐఆర్ లో ఎలా నమోదు చేసుకోవచ్చో చాట్ బాట్ లో సూచనలు కూడా చేసినట్లు తెలిపారు. దీంతో వెంటనే సిమ్, IMEI నంబర్లను బ్లాక్ చేస్తారు. దీనివల్ల సదరు మొబైల్ నంబర్ , మొబైల్ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండే వీలుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *