బస్సు కింద పడి యువకుడు మృతి

సిరా న్యూస్;

ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు టైరు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. సత్తుపల్లి మండలం చెరుకుపల్లికి చెందిన తాటి శ్రీరామ్ (19) ద్విచక్రవాహనంపై సోమవారం చెరుకుపల్లి నుంచి సత్తుపల్లికి వస్తుండగా, కిష్టారం వై-జంక్షన్ సమీపాన ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో ద్విచక్రవాహనం రహదారిపై ఉన్న గుంతలో పడడంతో అదుపుతప్పింది. ఆ యువకుడు ప్రమాదవశాత్తు బస్సును ఢీకొని వెనుక టైరు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *