సిరా న్యూస్,అన్నమయ్య;
తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట సమీపంలోని ఏటిమిట్ట వద్ద ద్విచక్ర వాహనాన్ని సిమెంట్ లారీ ఢీకొనడంతో మహేష్ (19) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు జన సైనికుడు అంటూ రాత్రి గబ్బర్ సింగ్ సినిమా చూసి తిరుగు ప్రయాణంలో తమ గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగింది. మృతుడు పెద్దతిప్ప సముద్రం మండలం సోన్ను వారిపల్లి కు చెందిన వాడు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న అనంతరం మృతదేహం పై వెళ్లిన లారీ చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహం లారీ ఇంజన్ భాగంలో ద్విచక్ర వాహనం ఇరుక్కుపోవడంతో కొంత దూరం ప్రయాణిండంతో లారీ,ద్విచక్ర వాహనం దగ్దమయ్యాయి.