సిరాన్యూస్,ఓదెల
సమస్యలపై స్పందించినవాడే నిజమైన కవి : అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్
సమాజంలో సమస్యలపై స్పందించిన వాడే నిజమైన కవి అని పెద్దపెల్లి జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. గురువారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రచయిత ల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 138 ఎన్నీల ముచ్చట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యాం ప్రసాద్ లాల్ మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా ప్రతి పౌర్ణమి రోజున ఒక రచయిత ఇంట్లో కవులందరూ కలిసి సామూహికంగా కవిత గానం చేయగా సాహిత్య చరిత్రలో గొప్ప విశేషం అని అన్నారు. నేటి పౌర్ణమి నుండి కవితలకు బదులుగా కథ పటణం చేయాలని నిర్ణయించడం జరిగింది. కొత్త వరవడిగా కథల ముచ్చట్లకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి వచ్చిన కవులకు పెద్దపెల్లి జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ ఆదిత్యం ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు సివి కుమార్, ప్రధాన కార్యదర్శి డి శంకరయ్య, గాజోజు నాగభూషణం , అన్నవరం దేవేందర్, విలాసాగరం రవీందర్, గుండు రమణయ్య, బూర్ల వెంకటేశ్వర్లు, రవీందర్ రామానుజం, సుజాత బి.రవీంద్రా చారి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.