సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఇంటర్‌లో సత్తా చాటిన “కెమిస్ట్రీ రెసోనెన్స్”
+ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 11 మందికి 460+ మార్కులు
+ ఫస్ట్ ఇయర్ బైపీసీలో నలుగురికి 430+ మార్కులు
+ విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపాల్ డి. ప్రమోద్ రెడ్డి
ఆదిలాబాద్‌లోని ప్రముఖ విద్యా సంస్థ ‘కెమిస్ట్రీ రెసోనెన్స్ జూనియర్ కాలేజ్’ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి, విజయ దుందూభి మోగించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో మొత్తం 470 మార్కులకు గాను ఏకంగా నలుగురు విద్యార్థులు 466 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. కె. నెహారిక దుర్గ, ఈ. అమితి, ఏ. మణికంఠ, ఏ. స్పూర్తి రెడ్డిలకు 470 మార్కులకు గాను 466 మార్కులు రాగా 99.14 శాతం మార్కులు సాధించారు. వీరితో పాటు పి. సాహితి, ప్రహర్ష, నల్ల చైత్ర రెడ్డి, నల్ల చైత్రిక రెడ్డి, రేణుక, అవంతిక, ఎం మణికంఠలు 460కి పైగా మార్కులు సాధించారు. కాగా బైపీసీ ఫస్ట్ ఇయర్‌లో సైతం ఇదే హవా కొనసాగింది. సారా మొహ్మద్ అనే విద్యార్థిని 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. ఈమేతో పాటు కీర్తన, సృష్టి, ప్రాప్తి అనే విద్యార్థినిలు 430కి పైగా మార్కులు సాధించారు. కాగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ డి. ప్రమోద్ రెడ్డి, ఇతర ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.