సిరా న్యూస్,విశాఖపట్నం;
తెలంగాణ నుంచి నేరుగా ఏపీకి చేరుకున్న నాగ సాధు అలియాస్ మహిళ అఘోరీ విశాఖకు చేరుకు న్నారు.నాగుల చవితి సందర్భంగా జోడిగుడ్లపాలెంలోని నాగ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందుత్వాన్ని కాపాడడం, మహి ళల రక్షణ, గో సంరక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తానని చెప్పారు.తన శక్తులు తెలుసుకోవాలంటే హిమా లయాలకు వస్తే చూపిస్తానని, ముఖ్యంగా ధర్మ పరిరక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తానని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబానికి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.