కేదార్ నాధ్ కు అఘోరీ…

 సిరా న్యూస్,అదిలాబాద్;

కొన్ని రోజులుగా రాష్ట్రంలో హల్ చల్ చేస్తున్న మహిళా ఆఘోరీ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయింది. స్వస్థలంలోనే ఆత్మార్పణ చేసుకుంటానంటూ కొన్ని రోజులుగా హడావిడి చేస్తున్న మహిళా అఘోరీ.. వివిధ కారణాలతో ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఇత ఈ రాష్ట్రంలో ఉండనంటూ కేథార్ నాథ్ వెళ్లిపోయింది. బెల్లంపల్లి మీదుగా కేథార్ నాథ్ వెళ్లిపోగా.. ఆమె వాహనాన్ని సరిహద్దుల వరకు అనుసరించిన పోలీసులు.. అఘోరీ వెళ్లిపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండానే ఒక్కసారిగా కొండగట్టులో ప్రత్యక్ష్యం అయ్యింది. అప్పటి వరకు అఘోరాలు మాత్రమే తెలిసిన జనానికి.. తాను మహిళా అఘోరీని అంటూ హడావిడి చేసింది. అంజన్నకు ప్రత్యేక పూజలు చేసిన ఆమె.. అక్కడి నుంచి సికింద్రాబాద్ లో కలకలం సృష్టించిన ముత్యాలమ్మ ఆలయం వద్ద ప్రత్యక్షమైంది. అక్కడ ప్రత్యేక పూజలు చేసి.. రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలోన దాదాపు అన్ని.. వార్త మాధ్యమాలతో పాటుగా సోషల్ మీడియాలో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ.. హల్ చల్ చేసింది.అనంతరం సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర ఆత్మార్పణ చేసుకుంటానంటూ ప్రకటించింది. దాంతో అప్రమత్తమైన పోలీసులు.. కేదార్ నాథ్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో సిద్దిపేట దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆమె సొంత గ్రామమైన మంచిర్యాల జిల్లా కుశ్నపల్లిలోని ఇంటికి తరలించి గృహనిర్భందం చేశారు.ఇలా వరుస ఘటనల తర్వాత.. పోలీసుల హెచ్చరికలు, భక్తులం అంటూ కొంత మంది అఘోరీ ఆత్మార్పణ చేసుకోవద్దని కోరారు. దాంతో.. ఆమె చేసిన శపథం నుంచి వెనక్కి తగ్గారు. తాను ఇక కనిపించనంటూ.. కేథార్ నాథ్ వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *