సిరాన్యూస్, సామర్లకోట
శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామిని దర్శించుకున్నమహిళా అఘోరా
సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఎంత దూరమైనా ప్రయాణిస్తానని మహిళా అఘోరా అన్నారు. మంగళవారం వేకువ జామున శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామిని మహిళా అఘోరా దర్శించుకున్నారు. పోలీసులు దగ్గరుండి అగోరినీ కి దర్శనం చేయించారు. ఈసందర్బంగా పలువురు మీడియా సిబ్బంది అడిగిన ప్రశ్నలకు మహిళా అఘోరా మాట్లాడారు. ఆడబిడ్డల విషయంలో ఏదైనా తప్పు జరిగితే తను సహించనని, గోవులను సంరక్షించడము, సనాతన ధర్మాన్ని కాపాడటమే తన బాధ్యత అని తెలిపారు. తాను ఆ విషయాల గురించి ఎంత దూరమైనా ఒంటరిగా పోరాడడానికి ప్రయాణం చేస్తానని తెలిపారు. దేవాలయాలను ధ్వంసం చేస్తే తాను ఊరుకోనని తెలిపారు. ఆ గోరిని చూడటానికి ఆలయ ప్రాంగణంలో ఉన్నభక్తులు ఉత్సాహం చూపించారు. ఒక్క మీడియా సిబ్బంది మీకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుసా,అతను కూడా సనాతన ధర్మాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని, అడగగా తనకు కొంత మంది చెప్పారని తెలిపారు.