సిరా న్యూస్,రాజోలు;
తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి సంఘటన వ్యవహారంలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రాజోలు లోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారి ఆలయానికి పాదయాత్ర చేపట్టిన కూటమి నేతలు, హిందూ సంఘాల సభ్యులు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొని మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక దేవాలయాలపై దాడులు జరిగాయని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఉద్దేశంతో వైసీపీ పనిచేస్తుందని, తిరుపతి లడ్డుని అపవిత్రం చేసినందుకే 11 సీట్లతో ఇంటికి పోయారని అన్నారు. హిందువులకు ఏకైక దిక్కుగా పవన్ కళ్యాణ్ నిలిచారని, ఆయనకి మద్దతుగా పాదయాత్ర చేస్తున్నట్లు కూటమినేతలు తెలిపారు.