సిరా న్యూస్, ఆదిలాబాద్:
బాబా సాహేబ్ అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషీ..
బాబా సాహేబ్ డా. బీ ఆర్ అంబేడ్కర్ అశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషీ చేయాలని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు అస్తక్ సుభాష్ అన్నారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పోరేష్ కార్యాలయంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. మనమంత అంబేడ్కర్ చూపిన అడుగుజాడల్లో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లాల మున్నా, తాక్సాండే ధర్మపాల్, భగత్ నరేష్, శరత్, రాజేష్, రవి, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.