సిరాన్యూస్, చిగురుమామిడి
ప్రొఫెసర్ సాయిబాబా చేసిన కృషి మరువలేనిది : అంబేద్కర్ యువజన సంఘం ఉల్లంపల్లి అధ్యక్షులు జేరిపోతుల శ్రీనివాస్
*ఉల్లంపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా ఆయన జీవితంలో అణగారిన వర్గాల కోసం చేసిన కృషి సమాజం ఎప్పటికీ మర్చిపోదని ఉల్లంపల్లి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జేరిపోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్రకుల వ్యవస్థ ఆధిపత్యంతో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కాలంలో మావోలిస్టులతో సంబంధం ఉన్నట్టు తప్పుడు కేసులు బనాయించి కొన్నెల్లపాటు జైల్లో ఉంచడం దారుణం అన్నారు.అయినప్పటికీ సుప్రీంకోర్టు స్వయంగా ఆయన ఏ తప్పు చేయలేదని తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.దేశంలో ఈ విధంగా ప్రశ్నించే గొంతుకల మీద దాడి చేయడం దారుణమన్నారు.సమాజం కోసం ప్రశ్నించే గొంతుకల మీద దాడులను ఖండిస్తున్నామన్నారు. వాక్ స్వాతంత్రపు హక్కును భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కల్పించడానికి గుర్తు చేశారు. అనంతరం కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కోల జీవన్, అల్వల మధు, మాజీ ఎంపీటీసీ కనవేని శ్రీనివాస్, మాజీ పాల కేంద్రం అధ్యక్షుడు కొత్త తిరుపతి, అక్విత తదితరులు పాల్గొన్నారు.