ప్రతి సి-సెక్షన్ ఆపరేషన్ కు ఆడిట్ ఫాం నమోదు చేయాలి

– సి సెక్షన్ ప్రసవాలను 60 శాతానికి తగ్గించాలి

– సి సెక్షన్ ఆదికంగా చేస్తున్న ఆసుపత్రుల తనీఖీ

– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సిరా న్యూస్,పెద్దపల్లి;
జిల్లాలో జరిగే ప్రతి సి- సెక్షన్ ప్రసవానికి సంబంధించి ఆడిట్ ఫాం నమోదు చేయాలని, సి- సెక్షన్ ఆపరేషన్ నియంత్రణకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సి- సెక్షన్ ప్రసవాల నియంత్రణ పై ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్ట్ డాక్టర్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ మన పెద్దపల్లి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులలో 90 శాతం సి- సెక్షన్ ప్రసవాలు జరుగుతున్నాయని, వీటిని 60 శాతానికి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులలో 70 శాతం కంటే తక్కువ సి- సెక్షన్ ప్రసవాలు జరుగుతుండగా, మరికొన్ని ఆస్పత్రులలో 100 శాతం అవుతున్నాయని, సి- సెక్షన్ ఆపరేషన్ రేట్లు తగ్గించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి సి-సెక్షన్ ఆపరేషన్ సంబంధించి కేసు వివరాలను ఆడిట్ ఫామ్ నింపాలని అన్నారు. అధికంగా సి- సెక్షన్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులను రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేసి సి- సెక్షన్ ఆపరేషన్ ఆడిట్ చేస్తాయని అన్నారు. సి- సెక్షన్ ద్వారా ప్రసవాలు చేసే సమయంలో తగిన ప్రోటోకాల్ పాటించాలని, ప్రోటోకాల్ ప్రకారం ఫోటోగ్రఫీ ఇతర స్టెప్స్ ను రికార్డ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అనవసరపు సి- సెక్షన్ ఆపరేషన్ జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. గర్భిణీలను సాధారణ ప్రసవాల దిశగా ప్రోత్సహిం చాలని, సాధారణ ప్రసవం జరిగేందుకు పాటించాల్సిన పద్ధతుల పై వారికి అవగాహన కల్పించాలని అన్నారు. అంత కుముందు అనేమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా అనేమియా నివారణకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు , ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్ట్ డాక్టర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *