కార్యదర్శిగా నరేష్ , కోశాధికారిగా పెనుగొండ నాగేందర్
సిరా న్యూస్,మహబూబాబాద్;
మహబూబాబాద్ జిల్లా మీసేవ యూనియన్ సభ్యుల ఎన్నికను మహబూబాబాద్ లోని అనంతాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఆదివారం రోజున మీసేవ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస చారి ,పిన్ని రాము ఆధ్వర్యంలో మీ సేవా యునియన్ ఎన్నికను నిర్వహించగా జిల్లా అధ్యక్షుడిగా దేశబోయిన అనిల్ కుమార్, కార్యదర్శి గా నరేష్, కోశాధికారిగా పెనుగొండ నాగేందర్ నూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేశ బోయిన అనిల్ కుమార్ మాట్లాడుతూ
మహబూబాబాద్ జిల్లా చరిత్రలో తొలిసారిగా 100కు పైగా మీసేవ సెంటర్ల సభ్యులందరం కలిసికట్టుగా భవిష్యత్తులో ప్రజలకు అందించ వలసిన సేవలపై, మా యొక్క సమస్యలపై మీసేవ యూనియన్ ద్వారా పరిష్కరించు కునేందుకు, నూతన యూనియన్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో కలిసికట్టుగా ఒకరి కొకరు సహకరించు కుంటూ ప్రభుత్వం తీసుకు వచ్చిన మార్పులను యూనియన్ ద్వారా ప్రజలకు తెలియ పరుస్తూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అనంతరం యూనియన్ సభ్యుల ఎన్నికను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.