సిరా న్యూస్,మంథని;
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు స్వర్గీయ బోగే రాజారాం మూడవ వర్ధంతి సభను ఈనెల 25న మంథని అంబేడ్కర్ సంఘ భవనంలో జరుపుతున్నామని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సోమవారం తెలిపారు. ఈ సంతాప కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు జేబీ రాజు, రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ ఐలయ్య, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, తెలంగాణ పరిశ్రమల శాఖ డైరెక్టర్ వెంకయ్య లతో పాటు దళిత సంఘాల ఉద్యమకారులు హాజరవుతారని వారు తెలిపారు. కావున రాజారాం అభిమానులు అంబేద్కర్ రిస్టులు, దళిత సంఘాల ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, మేధావులు అధిక సంఖ్యలో హాజరై సంతాప సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క రవి, డివిజన్ అధ్యక్షులు రామగిరి కుమార్, మండల అధ్యక్షులు జంజర్ల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కాన్నురి రవి, నాయకులు నూకల బానయ్య, అప్పాల పోచ మల్లయ్య, ఆర్ల జ్ఞానేందర్, ఐఆర్వి రాజు, బోగే రాజనర్సు, బోగే తిరుపతి, ఎడ్ల కిష్టయ్య సింగారపు కిష్టయ్యలు పాల్గొన్నారు