సిరాన్యూస్,భీమదేవరపల్లి
రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చింది : ఎమ్మెల్సీ కోదండరాం
* ముడుపు చెల్లించిన కోదండరాం
రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. సోమవారం ముడుపు చెల్లించడానికి ఎమ్మెల్సీ కోదండరాం కొత్తకొండ వచ్చారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను రాజకీయ నాయకులను ఏకం చేసి ఉద్యమ క్షేత్రంలోకి తీసుకురావడం ఒక ఎత్తయితే, తెలంగాణ ప్రజల ఇష్ట దైవాలకు ప్రజలు పూజలు, యాగాలు చేసి రాష్ట్రం సిద్ధించాలని తెలంగాణ వ్యాప్తంగా జరిగిందని తెలిపారు. భీమదేవరపల్లి మండలానికి వచ్చిన సందర్భంగా కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయం అర్చకులు కోరిన కోరికలు తీర్చే వీరభద్రుని కీర్తిని వివరిస్తూ రాష్ట్రం సిద్ధించడాని వీరభద్రుని ఆశీస్సులు కావాలంటే కొబ్బరికాయ ముడుపు కట్టమని పూజారుల సూచన చేశారని, అప్పుడు ముడుపు కట్టడంతో ప్రజా కంఠక పాలన పోయి ప్రజాపాలన వచ్చిన సందర్భంగా ముడుపు ఇవ్వడానికి కొత్తకొండ వచ్చినట్లు కోదండరాం పేర్కొన్నారు. ప్రజాపాలనలో ప్రభుత్వ భూముల అక్రమాలపై చర్యల కోసమే హైడ్రా ఏర్పాటు చేసి తెలంగాణ భూములు వనరులు తెలంగాణ ప్రజలకే చెందాలని సంకల్పంతో పాలన సాగుతుందని తెలిపారు. ధరణిలో గతంలో జరిగిన లోపాలను సవరించి సాదాబైనామాతో కొనుగోలు చేసిన పేదల ప్రయోజనాల కోసం సవరణలపై అధ్యయనం జరుగుతుందని అన్నారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 250 గజాల స్థలం కోసం సీఎంతో మాట్లాడుతానని ఉద్యమకారుల పక్షాన నిలబడతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ డ్యాగల సారయ్య,కవ్వ లక్ష్మారెడ్డి, మేకల వీరన్న యాదవ్, చెప్యాల ప్రభాకర్,ఉప్పుల కుమారస్వామి, చెప్యాల ప్రకాష్, కాశిరెడ్డి ఆదిరెడ్డి, గాండ్ల పద్మ, మాట్ల వెంకటస్వామి, ఎదులాపురం తిరుపతి, రేణికుంట్ల బిక్షపతి, సిద్ధమల్ల శ్రీనివాస్, పిడిశెట్టి శ్రీను, వేముల జగదీష్, ముక్కెర రాజు, పిడిశెట్టి కనుకయ్య, యాటపోలు శ్రీనివాస్, చిద్దురాల్ల, స్రవంతి ఏనుగు, తక్కలపల్లి రాజగోపాల్ రావు, మాడుగుల సంపత్ తదితరులు పాల్గొన్నారు