సిరా న్యూస్,అమరావతి;
నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్‌పై తుళ్లూరు పీఎస్‌లో మరో కేసు నమోదమయింది. వైకాపా నేతలు మూడు రాజధానుల శిబిరం వద్ద ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేసిన ఘటనలో హత్యాయత్నం కేసు నమోదయింది. గత యేడాది మార్చి 31న అమరావతి రాజధానికి సంఘీభావం తెలపడానికి వచ్చిన సత్యకుమార్‌పై దాడి చేసారు మూడు రాజధానుల శిబిరం నిర్వాహకులు. ఈ నేపధ్యంలో ఏ1 నందిగం సురేష్, ఏ2 బోరుగడ్డ అనిల్‌తో పాటు 25 మందిపై కేసు నమోదు అయింది.