అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య

-నేడు ఆయన జయంతి
-నేడు నేషనల్ ఇంజనీర్స్‌ డే
సిరా న్యూస్;
ఇంకొద్ది క్షణాల్లో ఈ వంతెన కూలిపోతున్నది…రైలును ఆపండి అంటూ కేకలు వేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సునిశిత మేధావి వెెూక్షగుండం విశ్వేశ్వరయ్య. మేం మాటలతో కాలయాపన చేశాం…మీరు నిరంతర క్రియాశూరులై నవభారత నిర్మాణా నికి కృషి చేసిన మహనీయులం టూ 1961 సెప్టెంబర్‌ 15న బెంగుళూరులో జరిగిన విశ్వేశ్వరయ్య శతాబ్ది వేడుకల్లో అప్పటి ప్రధాని నెహ్రూ చేత ప్రశంసలు పొందిన అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య..
మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకు లు బేస్తవారపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందినవారే. శ్రీనివాసశాస్ర్తి, వెంకటలక్ష్మమ్మలకు 1861 సెప్టెంబర్‌ 15న విశ్వేశ్వరయ్య జన్మించాడు. తల్లిదండ్రులు మోక్షగుండం గ్రామం నుంచి కర్నాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లా చిక్‌బల్లాపూ ర్‌ సమీపంలోని ముద్దనహళ్లికి వెళ్లి స్థిరపడ్డారు. ప్రాథమిక విద్య చిక్‌బల్లాపూర్‌లో సాగింది. తన 15వ ఏటనే తండ్రిని కోల్పో యిన విశ్వేశ్వరయ్య మేనమామ రామ య్య ప్రోత్సాహంతో బెంగుళూరు సెంట్రల్‌ కాలేజిలో 1880లో ఎం.ఎలో ప్రథమస్థానంలో పాసయ్యాడు. గణితంలో ప్రతిభ కలి గిన విశ్వేశ్వరయ్యను మైసూరు రాజ్య దివాను రంగయ్య గుర్తించి ప్రభుత్వానికి సిఫారస్సు చేసి స్కాలర్‌షిప్‌ ఇప్పించారు. ఆ ఉపకార వేతనంతో ఆయన పూణే వెళ్లి ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. దీంతో బొంబా యి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా నియమించింది. మరుసటి ఏడాది ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. ఆంగ్లపాలకులు విశ్వేశ్వరయ్య కార్యదీక్షను గుర్తించి ప్రపంచ జలాశయాల్లో ఒక్కటైన సుక్నూర్‌బరాజ్‌ నిర్మాణానికి ఇంజనీర్‌గా నియమించారు. దీంతో సింధూనది నీరు సుద్నోరుకు చేరేలా చేశాడు. ఆ నది నీరు వడగట్టడానికి ఒక వినూత్న విధానం రూపొందించారు. దాహరి దగ్గర నంబనది మీద సైఫన్‌ పద్ధతిన కట్ట నిర్మించారు. అక్కడ విశ్వేశ్వరయ్య మేధాశక్తితో ఆటో మేటిక్‌ గేట్లు నిర్మించి సమస్య తొలగించి అందరిని ఆశ్చర్యపరచారు. 1909లో మై సూర్‌ ప్రభుత్వం ఆయనను చీఫ్‌ ఇంజనీర్‌ గా నియమించింది.
నీటి వృధాను అరికట్టేలా చర్యలు
కృష్ణరాజసాగర్‌ డ్యాం డిజైన్‌ ఆయన ఆధ్వర్యంలోనే నిర్మాణం జరిగింది. దేశం లోనే తొలిసారిగా నీటి వృధాని అరికట్టేం దుకు నూతన చర్యలను చేపట్టారు. వర్షపు నీటిని ప్రాజెక్టుల ద్వారా నిలుపుదల చేయడం, ప్రవ హించే నీటిని అనకట్టలు, ఉక్కు తలు పుల ద్వారా అరికట్టడానికి రూపకల్పన చేసి తన ఆధ్వర్యంలోనే నిర్మా ణాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ డ్రైనేజీ పద్ధతులకు రూప కల్పన చేసిందీ కూడా ఆయనే. ప్రముఖ ఇంజినీర్లు అయిన కె.ఎల్‌.రావు, జాఫర్‌ అలీలు కూడా ఆయన సహాయ సహకారా లు తీసుకున్న వారే. విశ్వేశ్వరయ్యకు 1948 లో మైసూర్‌ ప్రభుత్వం డాక్టరేట్‌ ఎల్‌.ఎల్‌. డి ఇచ్చి సత్కరించింది. అలాగే బాంబే, కలకత్తా, బెనారస్‌, అలహాబాద్‌ తది తర యూనివర్శిటీలు డాక్టరేట్‌ పుర స్కారాలను అందజేశాయి. భారత ప్రభుత్వం 1955లో భారతరత్న అవార్డును ప్రధానం చేసి ఘనంగా సన్మానించింది. ఆయన ఇండి యన్‌ ఇరిగేషన్‌ కమిషన్‌ సభ్యులుగా, కర్నా టకలో చీఫ్‌ ఇంజనీరుగా అనేక బాధ్య తలను నిర్వహించి సివిల్‌ ఇంజనీరిం గ్‌లో అప్పట్లోనే నూతన వరవడులను సృష్టించి ప్రపంచ స్థాయిలో రికార్డులు సాధించారు. ఏప్రిల్‌ 12న 1962 లో విశ్వేశ్వరయ్య దివంతులయ్యారు. అయితే ఆయన పుట్టినరోజు సెప్టెంబర్‌ 15వ తేదీన ఇంజనీర్స్‌ డేగా జరుపుకుంటున్నారు. ఆయన పూర్వీకులు పూజించే దేవాలయం మోక్షగుండం ముక్తేశ్వరాలయం నేటికి భక్తులతో ప్రత్యేక పూజ లు అందుకుంటుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకుల గ్రామం మోక్షగుండం గ్రామస్థులంటే కర్నాటక రాష్ట్రంలో చాలా గౌరంగా చూస్తారు. విశ్వేశ్వరయ్య 102 సంవత్సరాలు జీవించి ఇంజనీరింగ్‌ రంగానికే పితామహుడయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *