సిరా న్యూస్, ఉట్నూర్
బొజ్జన్న బువ్వ అన్నదాన కార్యక్రమం పున:ప్రారంభం: మాజీ సర్పంచ్ ఆత్రం రాహుల్
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల ఆకలిని తీర్చే ఉద్దేశంతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో బొజ్జన్న బువ్వ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని కొత్తగూడ మాజీ సర్పంచ్ ఆత్రం రాహుల్ అన్నారు. సోమవారం ఉట్నూర్ ఐటిడిఎ కార్యాలయం ఎదుట బొజ్జన్న బువ్వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బొజ్జన్న బువ్వ కార్యక్రమం నిర్వహించలేదని, మళ్ళీ నేటి నుండి ప్రతి సోమవారం ఈ అన్నదాన కార్యక్రమం యదావిధిగా కొనసాగుతుందన్నారు. ప్రజలు ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వెడ్మ బొజ్జు పటేల్ యువసైన్యం సభ్యులు తదితరులు పాల్గొంటారు.