బాన్సువాడలో తల్వార్ తో దాడి కలకలం

సిరా న్యూస్,బాన్సువాడ;
బాన్సువాడ పట్టణంలోని తడ్కోల్ చౌరస్తా సమీపంలో మధురాలయ బార్ పరిసరాలలో బుధవారం తల్వార్ తో దాడి చేసిన సంఘటన కలకలం సృష్టించింది.మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకుల మధ్య మాటకు మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా, సోను సింగ్ అనే యువకుడు ఆటో డ్రైవర్ సంజీవ్ పై తల్వార్ తో దాడి చేశాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఆటో డ్రైవర్ సంజీవును హుటాహుటీన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స ను అందించిన ఆసుపత్రి సిబ్బంది పరిస్థితి విషమంగా ఉండటం తో అక్కడి నుండి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *