సిరా న్యూస్,యాదాద్రి;
అతివేగంగా కారు నడుపుతున్న యువకులను మందలించినందుకు కత్తులతో ముగ్గురిని గాయపరిచిన దుర్గటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం శుభాకార్యానికి వచ్చిన సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మద్యం సేవించి వేగంగా వాహనం నడుపుతున్నారు. వారిని వాహనాన్ని ఆపి మండలించిన స్థానిక కౌన్సిలర్ దండ అరుణ్ , చింటూ, సురేందర్ ల పై కట్టులతో దాడి చెశారు. స్థానిక ప్రజలు వెంటనే గాయపడిన ముగ్గిరిని హాస్పిటల్ తరలించారు అలాగే గాయపరిచిన వారిలో ఇద్దరినీ గాయపరిచగా మరో ఇద్దరినీని పోలీసులకు అప్పగించిగా ఒకరు పరారీ ఉన్నాడు. దాడి చేసిన స్థానికులతో దెబ్బలు తిన్న ఇద్దరు అలాగే గాయపడిన ముగ్గురు మొత్తం ఐదుగురుని కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుటున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు