నలుగురు పోలీసులకు గాయాలు
సిరా న్యూస్,బీజూపూర్;
చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా ఇవాళ ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర బార్డర్ నారాయణపూర్ జిల్లా సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు జవాన్లు గాయపడ్డట్లు తెలుస్తోంది. కాగా, మావోయిస్టులు సంచరిస్తున్నారన్న ఇంటలిజెన్స్ సమాచారం మేరకు రంగంలోకి దిగిన భద్రతా దళాలు అబూజ్మడ్ అడవులను జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య పరస్పరం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు నక్సలైట్లు హతం అయినట్లు సమాచారం. ఘటన స్థలం నుండి పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.నారాయణ్‌పూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ఈ ఎన్ కౌంటర్‌ను ధృవీకరించారు.ఘటన స్థలంలో కాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్ కౌంటర్ లో హతమైన మావోయిస్టల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, 2026 మార్చి వరకు దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతమొందిస్తామని కేంద్ర హాంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. అమిత్ షా ప్రకటన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్కౌంటర్లు జరగడం.. పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందటం గమనార్హం.