ఆలయాలపై దాడులను చేస్తే తాట తీస్తాం……

తెలంగాణ దర్మప్రసార్ సహ ప్రముఖ్ మదురనేని సుభాష్ చందర్

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో హిందూ ఆలయాలపై రోజు రోజుకు దాడులు పెరిగి పెరిగిపోయాయని వాటిని అదుపు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్య చెందిందని తెలంగాణ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ దర్మప్రసార్ సహ ప్రముఖ్ మధురనేని సుభాష్‌ చందర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి హిందూ వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తుందని అన్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ, సదాశివపేట్ లో వినాయకుని, షంషాబాద్ లో నవగ్రహ విగ్రహాలు ద్వంసం చేయబడ్డాయి. ఇంతకు నిందితులను ఈ ప్రభుత్వం అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓ వర్గం మెప్పు పొందడానికి గత ప్రభుత్వానికి హిందూ సమాజం దెబ్బ కోట్టిందన్నారు. ఈ ప్రభుత్వం ఇలాగే అనుసరిస్తే అదే జరుగుతుందని అన్నారు. ఆలయాలపై దాడులు చేసిన దుండగులు సీసీ కెమేరాలో పట్టుబడితే వారికి మతిస్థిమితం లేదని ఈ ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మతాలకు చెందిన ప్రార్థన మందిరాపై ఆ పిచ్చివారు ఎందుకు దాడులు చేయడం లేదని అన్నారు. కేవలం హిందు ఆలయాలపై మాత్రమే ఎందుకు ఆ మతిస్థిమితం లేని వారు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *