సిరా న్యూస్,కోవూరు;
మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసి పదివేలకు సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్న ఘటన నెల్లూరు జిల్లా కోవూరులో చోటు చేసుకుంది.పివిఆర్ కళ్యాణమండపం సమీపంలో పొలాల్లో ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మస్తానయ్య లేఔట్ పక్కన చిన్న గుడిసె వేసుకొని జీవిస్తున్నారు. మస్తానయ్య తన భార్య ఇంటిలో లేని సమయంలో లేఔట్ కి సంబంధించిన ట్రాక్టర్ డ్రైవర్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.బాలిక కేకలు వేసి అతని చేతిని కొరికి బయటకు పరుగులు తీసింది. దీంతో పక్కనే పనిచేస్తున్న తండ్రి మస్తానయ్య పరుగులు తీసి ఆ కామాంధుడ్ని పట్టుకోని పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయే ప్రయత్నం చేయగా అతను పని చేస్తున్న ట్రాక్టర్ యజమాని మల్లారెడ్డి వచ్చి బాలిక తండ్రిని పట్టుకొని ఆ యువకుడిని పరారయ్యేందుకు సహకరించాడు.బాలిక తల్లిదండ్రులు కోవూరు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. నిందితున్ని త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు.