సిరా న్యూస్, కుందుర్పి
సేవే లక్ష్యం…
* ఇన్పినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్
* బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
సేవే లక్ష్యం సేవయే పరమావధిగా భావించి తమ సంస్థ సమాజానికి శక్తి కొద్ది సేవలందిస్తుందని ఇన్పినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేర్మెన్,ఉపాధ్యాయుడు బద్దే నాయక్ అన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి మండలం ఎనములదొడ్డి గ్రామానికి చెందిన బోయ మహదేవ అనునతడు కరోనా విపత్కర పరిస్థితుల నుండి బ్లాక్ ఫంగస్ వ్యాధితో బాధపడుతుండేవారు. కుటుంబ పోషణ కూడా బారంగా మారింది. ఇబ్బందుల మధ్య సతమతమవుతున్న ఈ కుటుంబానికి గతంలో పలుమార్లు ఉపాద్యాయుడు బద్దే నాయక్ చేయూత అందించారు. అయితే దీర్ఘకాలంగా జబ్బుతో బాధపడుతున్న మహాదేవకు బెంగళూరులో బ్లాక్ ఫంగస్ కు వైద్య చికిత్స నిమిత్తం డబ్బు అవసరం కాగా , వెను వెంటనే ఇన్పినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేర్మెన్,ఉపాధ్యాయుడు బద్దే నాయక్ స్పందించారు. మంగళవారం చెక్ రూపంలో 20 వేల రూపాయలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో విద్య,వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అటు ఆరోగ్యవంతులుగా చేస్తూ ఇటు విద్యావంతులుగా తీర్చి దిద్దడమే ధ్యేయంగా తమ సంస్థ పనిచేయడానికి ఎల్లవేళలా కళ్యాణదుర్గం నియోజక వర్గ ప్రాంతపు ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు.