సిరా న్యూస్, ఆదిలాబాద్:
కోదండ రామ్ ను కలిసిన బాలురి గోవర్ధన్ రెడ్డి…
తెలంగాణ ఉద్యమ నాయకుడు, ప్రొఫెసర్ కోదండ రామ్ ను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, డిసిసిబి డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాదులో శుక్రవారం ఆయన్ని కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థుల యూనివర్సిటీ పరిధిని మారుస్తూ తీసుకున్న నిర్ణయం నేటికి అమలు కావడం లేదని అన్నారు. గతంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను విడదీసి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలను తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలను శాతవాహన యూనివర్సిటీ పరిధిలోకి మార్చారని అన్నారు. అయితే ఈ ఫైల్ గత 5 సంవత్సరాలు గా మాజీ ముఖ్యమంత్రి కేసీఅర్ వద్ద పెండింగ్ లో ఉందని అన్నారు. కాగా సానుకూలంగా స్పందించిన కోదండరాం, త్వరలో ఈ విషయంపై ఆరా తీస్తానని హామీ ఇచ్చారు.