Chanda T ZPHS: చందా-టి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం…

సిరా న్యూస్, ఆదిలాబాద్ రూరల్:

చందా-టి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం…

ఆదిలాబాద్ మండలంలోని చాంద-టి జడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని, పాఠశాల లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గణిత గుర్తులు, గణిత ముగ్గులు వేశారు. అనంతరం శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రకు సంబంధించిన సినిమాను ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామ్ రావు గారు మాట్లాడుతూ.. విద్యార్థులంతా తప్పనిసరిగా గణితం పై ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. గణితంతో మంచి భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆరె భాస్కర్, విద్యాసాగర్ రావు, మధుకర్ వర్మ, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *