సిరా న్యూస్,ఖానాపూర్
మహిళలకు రక్షణ కల్పించాలి :లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్
ఏజెన్సీ ప్రాంతంలో మహిళలకు రక్షణ కల్పించాలని లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా జై నూర్ మండలంలోని రాగాపూర్ గ్రామ సమీపంలో ఆదివాసి గిరిజన మహిళపై జరిగిన అత్యాచారం, హత్య సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో గిరిజన మహిళలను, గిరిజనేతర మహిళలను గౌరవించాలని కోరారు. నిందితులు ఎవరైనా ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారణ జరిపి శిక్షించాలని డిమాండ్ చేశారు.