సిరాన్యూస్, బేల
బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి : రీజినల్ మేనేజర్ ప్రభుదాస్
రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు వీలుగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పరిధిలో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆ బ్యాంకు రీజినల్ మేనేజర్ ప్రభుదాస్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని గణేష్ పూర్ లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బ్యాంకులు తక్కువ వడ్డీకి రైతు నేస్తం, ఇంటి బంగారు రుణాలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఖాతాదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.తక్కువ ప్రీమియంతో ఉన్న భీమా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.సొన్ ఖాస్ గ్రామానికి చెందిన అత్రం శంకర్ సహజ మరణం చెందగా ఆయనకుపీ ఎం జె జె వై కింద మంజూరైన రెండు లక్షల బీమా పరిహారం చెక్కును ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో బెలా బ్రాంచ్ చీఫ్ మేనేజర్ డి. రాజేశ్వర్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.