సిరా న్యూస్, తలమడుగు:
బరంపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం..
+ పోటెత్తిన భక్తజనం
+ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గుట్టపై వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శనివారం ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు గావించారు. భక్తులు భజనలు చేస్తూ, కీర్తనలు పాడారు. స్వామి వారి ఉత్తర ద్వారాన్ని దర్శించుకొని, అర్చనలు గావించారు. ఈ సందర్భంగా హారతి, మహాన్నదానం నిర్వహించారు. కాగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు కేదారేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… భక్తుల కోసం ప్రతీ ఏట ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించడంతో పాటు స్వంత డబ్బులతో మహాన్నదాం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కోశాధికారి మల్లేష్, తాంసీ, భీంపూర్ జడ్పిటీసీలు రాజు, సుధాకర్, తలమడుగు పీఏసీఎస్ చైర్మెన్ ముడుపు దామోదర్ రెడ్డి, సీఈవో శ్రీనివాస్, బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ వెంకటేష్, వివిద గ్రామాల సర్పంచ్‌లు, భక్తులు పాల్గొన్నారు.