సిరా న్యూస్, కోనరావుపేట:
గల్ఫ్ దేశంలో బావుసాయిపేట గ్రామానికి చెందిన యువకుడు మృతి…
జీవితంపై గంపెడు ఆశలతో బతుకుతెరువు కోసం బెహరన్ గల్ఫ్ దేశం వెళ్లి రంబలల్లో పనిచేస్తుండగా దురదృష్టవశాత్తు ఇసుక మేటలు కూలి కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన బొడ్డు బాబు (29) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన బాబు గ్రామంలో ఉంటూ ఆటో కార్మికుడిగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించాడు. అయితే స్థానికంగా ఉపాధి లేకపోవటంతో గత రెండు నెలల క్రితం బెహరాన్ వెళ్లి కార్మికుడిగా పని చేసుకుంటున్నాడు. అయితే నిన్న గురువారం సాయంత్రం ఇసుక మేటలు కూలి అక్కడికక్కడే మృతి చెందడంతో వెంటనే అక్కడి అధికారులు స్వగ్రామానికి సమాచారం అందించారు. మృతుడి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మృతుడికి భార్య ఒక కుమారుడు ఉన్నాడని గ్రామస్తులు తెలిపారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు..