సిరా న్యూస్, బేల
మహిళకు రక్తదానం చేసిన బెదుర్కర్ అజయ్
* సామ రుపేష్ రెడ్డికి, రక్తదాతకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబీకులు
రక్తహీనతతో బాధపడుతూ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళకు ఓ యువకుడు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు.పూర్తి వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మాంగ్రూడ్ గ్రామానికి చెందిన సత్యశిల అనే మహిళ రక్తహీనతతో బాధపడుతూ ఆదివారం అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చేరింది. అయితే వైద్యులు బాధితురాలికి ఓ పాజిటివ్ రక్తం అత్యవసరమని సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రుపేష్ రెడ్డిని సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి బేల మండలంలోని అవల్ పూర్ గ్రామానికి చెందిన బెదుర్కర్ అజయ్ అనే యువకుడికి పరిస్థితిని వివరించారు.దీనికి వెంటనే స్పందించిన యువకుడు రిమ్స్ ఆస్పత్రికి వచ్చి రక్తదానం చేయడంతో బాధితురాలికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు పేర్కొన్నారు. అత్యవసర సమయంలో స్పందించి మహిళలకు అవసరమైన గ్రూపు రక్తాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించిన సామ రూపేష్ రెడ్డి తో పాటు రక్తదానం చేసిన యువకుడిని వైద్యులు అభినందించగా బాధితురాలి కుటుంబ సభ్యులు దయాకర్ కృతజ్ఞతలు తెలిపారు.ఆయన వెంట వాబ్ తదితరులు ఉన్నారు.