సిరా న్యూస్, బేల
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి
ఆదిలాబాద్ జిల్లా బేల ఉన్నత పాఠశాల, అశ్రమ ఉన్నత బాలుర పాఠశాల పక్కనుంచి జాతీయ రహదారి వెళ్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వందల సంఖ్యలో విద్యార్థులు ఇక్కడ బస్సులు, ఆటోలు దిగి పాఠశాలకు వెళ్తుంటారు . దీంతో ఉదయం ,సాయంత్రం వేళ ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి ప్రాణహాని జరగకముందే అధికారులు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని పోషకులు కోరుతున్నారు.