సిరాన్యూస్, బేల
బేలలో ఘనంగా పొలాల అమావాస్య
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంతో పాటు ఇంద్రా నగర్, అశోక నగర్, పాత బస్తీలో అన్నదాతలు ఘనంగా పొలాల పండుగ జరుపుకున్నారు. ఈసందర్భంగా అన్నదాత కు సాగులో తోడుండే ముగా జీవులకు పూల దండలు,గజ్జెలు, కొత్త సన్నహాలతో ముస్తాబు చేసి ఎద్దుల ను అలంకరించి డప్పు, వాయిద్యాలు వాయిస్తూ బసవన్నలకు నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ ఆలయాల చుట్టూ ఎద్దుల ను ప్రదక్షణ లు చేయించి, మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ రోజున బసవన్నలు మహాదేవుని తన గోడు విన్నవించూ కుంటాయని , పశువుల మొరా వినడానికి మహాదేవుడు వస్తాడని రైతుల నమ్మకం.అలంకరించిన ఏ ద్దులతో ఊరేగింపు జరుపుకున్నారు. ఇంటింటికి బసవన్నలకు పూజలు చేసి నైవేద్యాలు పెట్టీ, పాడిపంటలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కులు తీసుకున్నారు.