BELA : బేల‌లో ప్రశాంతంగా కొనసాగిన బంద్

సిరా న్యూస్‌, బేల‌
బేల‌లో ప్రశాంతంగా కొనసాగిన బంద్
* తహసీల్దార్‌కి వినతిపత్రం అంద‌జేసిన ఆదివాసీ సంఘాల నాయ‌కులు

ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్,రాయి సెంటర్ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ కార్యక్రమం మండల వ్యాప్తంగా శనివారం ప్రశాంతంగా కొనసాగింది.ఇందులో భాగంగా మండల కేంద్రంలోని వ్యాపార, వాణిజ్య సముదాయలు స్వచ్చందంగా బంద్ పాటించారు.ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల,కళాశాలలకు ఆదివాసీ సంఘాలు వెళ్లి బంద్ కి సాకరించాలని కోరగా విద్య సంస్థలు ముసివేశారు.దీంతో బేల మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్ళల్లో జనాలు లేక రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.మండల కేంద్రంలో ఎలాంటి ఆవంచానియా సంఘటనలు జరగకుండా జైనథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు. అనంతరం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తమ న్యాయ పరమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు సిడాం నందు కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు బేల మండల కేంద్రం బంద్ విజయవంతంగా కొనసాగింది.జైనూర్ లో ఆదివాసీ మహిళపై హత్యాచారయత్నం చేసి తీవ్రంగా గాయపరచిన నిందితుడిని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరవృతం కాకుండా చూడాలని కోరారు.ఆదివాసీ గ్రామాల్లో ఉండే చట్టాలు పకడ్బందీగా అమలు అయ్యో విదంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *