సిరాన్యూస్,బేల
బేలలో కంది శ్రీనివాస రెడ్డి ప్లెక్సీకి పాలాభిషేకం
* నిధుల విడుదలతో గ్రామస్తుల్లో హర్షం
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి కృషి జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క చొరవతో నియోజకవర్గానికి ఒకేసారి సీఆర్ ఆర్ గ్రాంట్ కింద 10 కోట్లు వివిధ 115 పనులకు సంబంధించి ఎస్డీఎఫ్ నిధులు 4కోట్లు మొత్తం 14 కోట్ల నిధులు మంజూరుకావడంతో కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజలలో హర్షం వ్యక్తమవుతోంది.దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న గూడ ,బాది , అవాల్ పూర్, కొబ్బయి,చప్రాల,మాంగృడ్,బేల లతో పాటు పలు గ్రామాల్లో పాలభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావార్,మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్, సుదాం రెడ్డి,ఎల్టీ కిష్టా రెడ్డి, కాట్ పెల్లి కిష్టా రెడ్డి, జామ మసీద్ మండల అధ్యక్షులు షకీలా ఖాన్,మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంఖడే, మాజీ కో ఆప్షన్ సభ్యులు అక్తర్,మాజీ ఎంపీటీసీ గోపత్ శంకర్, నానాజీ పటేల్ తదితరులు పాల్గొన్నారు.