సిరాన్యూస్,బేల
క్రీడలతో మానసికోల్లాసం: ఎంఈఓ కోల నరసింహులు
* బేలలో జిల్లా స్థాయి బాలుర కబడ్డీ ఎంపిక పోటీలు
క్రీడలతో మానసికోల్లా సంతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందని బేల ఎంఈఓ కోల నరసింహులు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్ -17 బాలుర జిల్లా స్థాయి కబడ్డి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంఈఓ కోల నరసింహులు ఎస్జిఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంతారావుతో కలిసి పోటీలను ప్రారంభించారు. గ్రామీణ స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించడంతో క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది అన్నారు. అందులో భాగంగానే ఇక్కడ పోటీలు నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాల నుంచి 100 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు.జోనల్ స్థాయికి జట్టును ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కదం మహాలక్ష్మి, చప్రాల కాంప్లెక్స్ హెచ్ఎం రమేష్, పంచాయతీ ప్రత్యేక అధికారి సుధారాణి,మాజీ సర్పంచ్ భూమన్న, కిష్టారెడ్డి,పీడీ జ్యోతి , జిల్లాలోని పీడీ లు,క్రీడాకారులు పాల్గొన్నారు.