సిరాన్యూస్, జైనథ్
పత్తి పంటకు మద్దతు ధర చెల్లించాలి: మాజీ మంత్రి జోగు రామన్న
గుజరాత్ తరహాలోనే ఆదిలాబాద్ జిల్లా లో పండుతున్న పత్తి పంటకు మద్దతు ధర చెల్లించాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జోగురామన్న మాట్లాడారు . పసల్ భీమా విషయంలో రాద్దాంతం చేసిన పాయల్ శంకర్ నేడు నోరు మేదపక పోవడం చాలా విడ్డూరంగా అని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ కు ఎమ్మెల్యే గా పాయల్ శంకర్ ను, ఎంపీగా గోడం నగేష్ ను బీజేపీ పార్టీ నుండి గెలిపించిన ఆదిలాబాద్ రైతు లను పత్తి ధర విషయంలో ఇద్దరు నట్టేట ముంచారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా , రైతు రుణమాఫి విషయం లో తెలంగాణ రైతులను మోసం చేసిందని అన్నారు. బీఆర్ ఎస్ హయంలో అభివృద్ధి పథంలో పయనించిన తెలంగాణ నేడు తిరోగమనం లో పయనిస్తోంది అన్నారు . కల్వకుంట్ల తారక రామారావు అక్టోబర్ 24 న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంకు రానున్నారన్నారు. ఆదిలాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రోకండ్ల రమేష్, ఇజ్జగిరి నారాయణ, మారి శెట్టి గోవర్ధన్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.