సిరాన్యూస్,జైనథ్
గిమ్మ (కే)లో కంది శ్రీనివాస్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ కే గ్రామంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి చిత్ర పటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సదాలి శివ్వన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 4 కోట్ల రూపాయల నిధులు మంత్రి సీతక్క చొరవతో విడుదల చేయించారు అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ తో మాత్రమే ఆదిలాబాద్ అభివృద్ధి అవుతుందని, ఈ విషయం ప్రజలు గ్రహించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి అండగా వుండాలని కోరారు. కార్యక్రమంలో జిట్టా నర్సింగ్,సదాలి రామన్నా ,జైనథ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామన్న , గ్రామస్తులు ఉన్నారు.