సిరా న్యూస్, బేల:
భక్తి శ్రద్ధలతో దగ్గులవ్వ విగ్రహ ప్రతిష్టాపన..
– భారీగా తరలివచ్చిన భక్తులు
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో ఆదివారం భక్తి శ్రద్ధలతో దగ్గులవ్వ విగ్రహ ప్రతిష్టాపన గావించారు. ఉదయం 4 గంటల నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భజనలు, కీర్తనలు, ఇతర పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దగ్గులవ్వ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ శాంతులు ప్రసాదించాలని భక్తులు మొక్కుకున్నారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహాన్నదానం గావించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.