Bela high school: బేల‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

సిరా న్యూస్, బేల‌
బేల‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఉన్నత పాఠశాలలో 2016-17 సంవత్సరంలో పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 8 ఏళ్ల తర్వాత ఒకచోట కలుసుకోవడంతో సంతోషపడ్డారు. తమ మధురానుభూతులను పంచుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. భవిష్యత్తులో తోటి మిత్రులకు ఎవరికి ఆపద వచ్చినా అండగా నిలవాలని తీర్మానించారు .అనంతరం తమకు పాఠాలు చెప్పిన గురువులకు సన్మానించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోల నర్సింలతో పాటు నాడు పాఠాలు చెప్పిన గురువులను గుర్తుపెట్టుకుని పిలిచి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు , మౌనిక , పల్లవి, ప్రగతి, అనురాధ,చ నికిత్ సచిన్ , శ్రీకాంత్ , నవీద్, నిలేష్
ప్రజ్వల్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *