సిరా న్యూస్, బేల
బేలలో ఉచిత వైద్య శిబిరం : యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి
తిరుమల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రుపేష్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి తోపాటు కొత్త సాంగిడి గ్రామానికి చెందిన రోగులు శిబిరానికి బారులు తీరారు. శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సందీప్ రెడ్డి ,రంజిత్ కుమార్ డాక్టర్ సాయి కృష్ణ ,ఇంద్రజ హాజరై 350 మందికి పైగా రోగులకు గుండె,కిడ్నీ నరాలు,చిన్న పిల్లలకు సంబంధించిన ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు సేవలు చేయడం ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు.ప్రతి మనిషిలో అనారోగ్య కారణాలవల్ల అనేక సమస్యలతో సతమతమవుతున్న నేటి సమాజం కోసం చేయూతనివ్వడం మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని పేర్కొన్నారు.బీపీ,షుగర్ లాంటి వ్యాధులకు సాధారణమైన వైద్యంతో అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని తెలిపారు.శిబిరంలో రక్త పరీక్షలు ,మందులు రోగులకు ఉచితం గా పంపిణీ చేసినట్టు ట్రస్ట్ చైర్మన్ బండ అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రుపేష్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందజేయడం అభినందనీయమన్నారు.గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అనంతరం వైద్య బృందానికి శాలువాతో సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తిరుమల ట్రస్ట్ సభ్యులు వ్యవస్థాపకులు బండ అనిల్ కుమార్ తో పాటు కమిటి సభ్యులు కుర్ర నరేష్,అనుముల ఉదయ్ కిరణ్,బండ సునీల్,సుమన్,సామల రవి,చంద్రకాంత్ రెడ్డి,భూషణ్, వైద్య సిబ్బంది తో పాటు గ్రామస్తులు నర్సారెడ్డి దయాకర్, పటేల్,సుధాకర్,వినోద్, ప్రవీణ్, జగదీష్ రెడ్డి, మంచికటి నవనీత్,సాయి,గణేష్,తదితరులు పాల్గొన్నారు.