BGR: ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం: బాలూరి గోవర్ధన్ రెడ్డి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం: బాలూరి గోవర్ధన్ రెడ్డి
* జొన్నల డబ్బులు జమ చేయబడతాయి 
* రాశి విత్తనాల కొరత లేదు

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతులకు మేలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆదిలాబాద్ జిల్లా పార్టీ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 36 వేల మెట్రిక్ టన్నుల జొన్నలు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. దీనికి సంబంధించిన 74 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఇందులో ఇప్పటికే రైతుల ఖాతాల్లో 44 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని, మిగతా 30 కోట్ల రూపాయలు మార్క్ ఫెడ్ వద్ద బ్యాలెన్స్ ఉందని తెలిపారు. అయితే రోజుకు ఐదు కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించే అవకాశం ఉన్నందున, దశలవారీగా ప్రతి రైతు ఖాతాలో జొన్నల డబ్బులు జమ చేయడం జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా రాశి విత్తనాల కొరత ఏమాత్రం లేదని, జిల్లాకు లక్ష ప్యాకెట్ల అవసరం ఉండగా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క, కలెక్టర్ రాజర్షి షా, నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డిల కృషి మేరకు మరో 70 వేల ప్యాకెట్లు సైతం అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో నాయకులు సుదర్శన్, కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *