సిరా న్యూస్, ఇంద్రవెల్లి:
సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకోవాలి…
బడుగుబలహీన వర్గాల ప్రజలు, మహిళల విద్యాభివృద్ధికి విశేషంగా కృషీ చేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలేను ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని భీం ఆర్మీ ఖానాపూర్ నియోజక వర్గ ఇంచార్జీ పరత్వాగ్ సందీప్ అన్నారు. బు«ధవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో భీం ఆర్మీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్త్రీల హక్కులు, విద్యాభివృద్ధి కోసం తన యావత్ జీవితాన్ని ధరపోసిన ఆదర్శ వనిత సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేధిక జిల్లా అధ్యక్షుడు కాంబ్లే అతీష్ కుమార్, నాయకులు సోన్‌కాంబ్లే జితేందర్, ముఖాడే ఉత్తం, సోన్‌కాంబ్లే సూరజ్, జోందలే విజయ్, కాల్బాండే గజానంద్, జోందలే సంజీవ్, వాగ్మారే ప్రశాంత్, సోన్‌కాంబ్లే నవీన్ కుమార్, భాలేరావ్ భాస్కర్, దిలీప్ గాయక్వాడ్, కాంబ్లే ధమ్మానంద్, తదితరులు పాల్గొన్నారు.