పాల్గోన్న మంత్రి పొన్నం
సిరా న్యూస్,సిద్దిపేట;
హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలో తంగలపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కాంప్లెక్స్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేసారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నమూనాలను వీడియో రూపంలో చూపించారు.
మంత్రి మాట్లాడుతూ
హుస్నాబాద్ కి అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ రావడం విద్యా రంగంలో హుస్నాబాద్ మరింత ముందుకు పోతుంది. 28 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లకు ఈరోజు భూమి పూజా చేయాలని ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం లో కోహెడ మండలం తంగలపల్లి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు భూమి పూజ చేసుకున్నాం. విద్యార్థి నాయకుడిగా మీ అందరి ఆశీర్వాదంతో హుస్నాబాద్ ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యాను. విద్యా ,వైద్యం ,టూరిజం ,పరిశ్రమలు , వ్యవసాయం ,ఉపాధి కల్పన అన్నిటిపై దృష్టి సరించాం. జీవో 190 ద్వారా నాలుగు గురుకులాలు ఒకే కాంప్లెక్స్ గా విద్య ను అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి ఏర్పాటు చేశాం. నాలుగవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకునేల భవనాల నిర్మాణం జరుగుతుంది. విద్యా శాఖ ముఖ్యమంత్రి వద్ద ఉన్నప్పటికీ వివిధ విద్యా కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామిని అయ్యాను. రాష్ట్రంలో 25 వేల పాఠశాలలకు 1100 కోట్లతో మౌలిక వసతులు కల్పించాం.స్కూల్ లకి ఉచిత విద్యుత్,డ్రింకింగ్ వాటర్ , శానిటేషన్ సిబ్బంది కి జీతాలు పై ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది.దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు19 వేల ప్రమోషన్ లు ,35 వేల బదిలీలు చేశాం. డీఎస్సీ ద్వారా 10 వేల మందికి నియామక పత్రాలు అందించాం. గురుకుల లో మెస్ బకాయిలు చెల్లించడం తో పాటు, అద్దె బకాయిలు కూడా చెల్లిస్తున్నం. ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి రు ఈ ఆలోచన ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు ఏర్పాటు అవుతున్నాయి. ఈ జిల్లాలో నాలుగు స్కూల్ లు వస్తున్నాయి. 5 వేల కోట్లతో ఈ పాఠశాలల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాల నిర్మాణం జరుగుతుంది. 180 కోట్లతో ఒక్కో పాఠశాల నిర్మాణం జరుగుతుంది. వచ్చే విద్యా సంవత్సరం లోపు ఈ పాఠశాల భవనం నిర్మాణం పూర్తి చేస్తాం . అన్ని రకాల వాతావరణానికి తగిన విధంగా ఈ భవన నిర్మాణం జరుగుతుంది.. అన్ని రకాల వసతులు అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పించి తీర్చిదిద్దుతాం . ఈ ప్రాంతం అంత ఎడ్యుకేషన్ హబ్ గా మారాలి. కస్తూర్బా పాఠశాల ,మోడల్ స్కూల్ ఆ రోజులోనే తెచ్చాం. ఇన్నోవేషన్ పార్క్ త్వరలోనే భూమి పూజ కార్యక్రమం ఉంటుందని అన్నారు.
బస్వపూర్ లో కృషి విజ్ఞాన కేంద్రం కి స్థల పరిశీలన చేశాం.. త్వరలోనే భూమి పూజ కార్యక్రమం చేసుకుంటాం. సర్వాయి పేట లో టూరిజం హబ్ ,ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి 37 కోట్లు కేటాయించుకున్నాం. అక్కన్నపేట్ లో పరిశ్రమల హబ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎల్కతుర్తీ లో 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వ స్థలాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్,యంగ్ ఇండియా స్కిల్స్ డెవలప్మెంట్ అకాడమి వచ్చింది..యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ వచ్చిందని అన్నారు.