సిరా న్యూస్, కరీంనగర్:
బైక్ ప్రమాదంలో నారాయణపూర్ యువకుడి మృతి…
కరీంనగర్ జిల్లా కోహెడ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన యువకుడు రాజన్(35) బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన శంకర్, ప్రమీల దంపతుల కుమారుడు రాజన్ షూటింగ్ పనుల చేసుకుంటూ జీవిస్తున్నాడు. రాజన్ తండ్రి శంకర్ 20 సంవత్సరాల క్రితమే గుండెనొప్పితో మృతి చెందారు. అప్పటి నుంచి తల్లి ప్రమీల కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని సాకుతోంది. కాగా చేతికందిన కొడుకు బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో ప్రమీల గుండెలు పగిలేలా రోదించింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.